కమలాపూర్, డిసెంబర్ 3 : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం నేరెళ్లలో సర్పంచ్ అభ్యర్థులు వింత ప్రచా రం చేస్తున్నారు. సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామస్థులకు కోతుల బెడద లేకుండా చేస్తామని హామీ ఇవ్వడమే కాదు అప్పుడే రంగంలోకి దిగిపోయారు.
మొత్తం ఎనిమిది మంది పోటీ చేస్తుండగా అందులో ఓ నలుగురు అభ్యర్థులు చింపాంజీ, ఎలుగుబంటి వేషధారణతో కూలీలను పెట్టి కోతులను తరిమేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తంటాలు పడుతున్నారు. గ్రామంలో అభ్యర్థుల వింత ప్రచారం అందరినీ ఆకట్టుకుంటున్నది.-