వేములవాడ రూరల్, డిసెంబర్ 5: ప్రచారాన్ని ప్రారం భించిన సర్పంచ్ అభ్యర్థి ఆకస్మికంగా మృతి చెందడం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చింతల్ఠాణా ఆర్అండ్ఆర్ గ్రామంలో విషాదం నింపింది. చింతల్ఠాణా (ఎస్సీ రిజర్వ్)లో మొదటి విడుత పంచాయతీ ఎన్నికల్లో చర్ల మురళి (53) బీఆర్ఎస్ బలపర్చిననననననl సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. గురువారం రాత్రి 10 గంటల వరకు ప్రచారం చేసి ఇంటికి వచ్చిన కాసేపటికే గుండెపోటు రావడంతో అస్వస్థత చెందాడు. అభ్యర్థి మృతితో గ్రామంలో ఎన్నికలపై సందిగ్ధం నెలకొన్నది.