Jagadish Reddy | దేశం కోసం కల్నల్ సంతోశ్ పోరాడారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తెలిపారు. కల్నల్ సంతోశ్ తల్లి మంజులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించడని పిలుపునిచ్చారు. సూర్యాపేట పట్టణంలోని ఆదివారం నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. సూర్యాపేటలో నీటి సమస్యను పరిష్కరించింది కేసీఆర్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. కల్నల్ సంతోశ్ తల్లి మంజులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించడని పిలుపునిచ్చారు.
పట్టణంలో కనీసం పార్క్ నిర్వహణను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సూర్యాపేట అభివృద్ధికి రూపాయి ఇవ్వలేదని తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక 2014 కంటే ముందు రోజులు మళ్లీ దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు చేయడం లేదని విమర్శించారు. తులం బంగారం ఇస్తామని ఆడబిడ్డలను మోసం చేశారని మండిపడ్డారు. యూరియా సక్రమంగా ఇవ్వకుండా రైతులను గోసపెడుతున్నారని మండిపడ్డారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సిట్ నోటీసుల పేరుతో రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని తెలిపారు. పాలన చేతకాక రేవంత్ బూతులతో రెచ్చిపోతున్నాడని పేర్కొన్నారు. చేసిన అభివృద్ధి ఏమీ లేకనే రేవంత్ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నాడని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు కర్రుకాల్చి వాతపెట్టాలని జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి, దోపిడీ రాజ్యమేలుతోందని మండిపడ్డారు.