NTA | పరీక్షల్లో అక్రమాలపై విమర్శలు.. 50 మందిని తొలగించిన ఎన్టీఏ
NTA | ప్రశ్నాపత్రాల లీకేజీ (Paper Leaks), పరీక్షల్లో అవకతవకల (Exam frauds) పై కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండడంతో జాతీయ పరీక్షల ఏజెన్సీ (NTA) కీలక చర్యలు చేపట్టింది. పరీక్షా విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేసే చర్యల్లో భాగంగా 50 మందికిపైగా సిబ్బందిని తొలగించింది. సంస్థలోని కీలక స్థానాల్లో నిపుణులను నియమిస్తున్నది.
NTA : ప్రశ్నాపత్రాల లీకేజీ (Paper Leaks), పరీక్షల్లో అవకతవకల (Exam frauds) పై కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండడంతో జాతీయ పరీక్షల ఏజెన్సీ (NTA) కీలక చర్యలు చేపట్టింది. పరీక్షా విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేసే చర్యల్లో భాగంగా 50 మందికిపైగా సిబ్బందిని తొలగించింది. సంస్థలోని కీలక స్థానాల్లో నిపుణులను నియమిస్తున్నది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ (Union Education Ministry) ప్రకటన వెలువరించింది. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ వంటి పది కొత్త స్థానాల కోసం ప్రకటనలు జారీచేసి, నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపింది.
సైబర్ భద్రత, సైకోమెట్రిక్స్, ప్రశ్నపత్రాల రూపకల్పన, ఇతర ప్రత్యేక విభాగాల కోసం ప్రైవేట్ రంగం నుంచి కూడా నిపుణులను తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. నిర్దేశిత పరీక్షా విధానాలను కచ్చితంగా పాటించాలని విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అధికారులను ఆదేశించారు. ప్రశ్నపత్రాల గోప్యతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక గదులు, ఎయిర్-గ్యాప్డ్ సిస్టమ్స్ (ఇంటర్నెట్తో సంబంధం లేని వ్యవస్థలు), పరికరాలను భద్రపరిచే విధానాలను పూర్తిగా పునర్ వ్యవస్థీకరించాలని పేర్కొన్నది.
అన్ని పరీక్షా ప్రక్రియలపై సమగ్ర ఆడిట్ నిర్వహించి, నివేదిక సమర్పించాలని ఎన్టీఏను ఆదేశించారు. సోమవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి.. ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సహా ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

