CPI(ML) Massline | సామ్రాజ్యవాదం,పెట్టుబడిదారుల దోపిడీని తిప్పికొట్టాలి : సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్
CPI(ML) Massline | సామ్రాజ్యవాదం, బడా పెట్టుబడిదారుల దోపిడీకి వ్యతిరేకంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు ఐక్యంగా పోరాడాలని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.కృష్ణ పిలుపు నిచ్చారు.
ఊట్కూర్ : సామ్రాజ్యవాదం, బడా పెట్టుబడిదారుల ( Capitalists ) దోపిడీకి వ్యతిరేకంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు ఐక్యంగా పోరాడాలని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ ( Massline ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.కృష్ణ ( Krishna ) పిలుపు నిచ్చారు.
నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం బిజ్వార్లో రెండు రోజులుగా కొనసాగుతున్న పార్టీ జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల్లో భాగంగా సోమవారం ఆయన మాట్లాడారు. దేశంలో కోట్లాది మంది కార్మికులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నప్పటికీ అధిక శాతం మంది అసంఘటిత రంగంలోనే ఉన్నారని వెల్లడించారు. వారికి కనీస వేతనాలు, ట్రేడ్ యూనియన్ హక్కులు, పని గంటలు, ఇతర సౌకర్యాలు అందడం లేదన్నారు.
మరోవైపు రైతాంగం విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ యంత్రాలు, మార్కెట్, రుణాల సమస్యలతో సతమతమవుతోందన్నారు. అమెరికా సామ్రాజ్య వాదంతోపాటు గుత్తాధిపత్య సంస్థలు మార్కెట్‌ను శాసిస్తున్నాయని విమర్శించారు. బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా విధానాలు రూపొందిస్తున్న పాలకులు రైతులు, కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.
శిక్షణ తరగతుల్లో పార్టీ పని విధానంపై బి.రాము, కమ్యూనిస్టు పార్టీ చరిత్రపై ఎస్.కిరణ్ బోధించారు. పి.రామకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మక్తల్, నారాయణపేట డివిజన్ కార్యదర్శులు సలీం, కాశీనాథ్, జిల్లా నాయకులు కాలేశ్వర్, యాదగిరి, కిరణ్, బోయినపల్లి రాము, జయ, భగవంతు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

