Samsung | ఎక్సినోస్ 2500 చిప్‌తో భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ S26 FE విడుదల
Samsung | సెల్‌ఫోన్ అభిమానులకు దక్షిణ కొరియా దిగ్గజ కంపెనీ శాంసంగ్ శుభవార్త ప్రకటించింది. తన గెలాక్సీ S26 FE సిరీస్ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ వివరాలు ఇలా ఉన్నాయి.
Samsung | శాంసంగ్ తన ‘ఫ్యాన్ ఎడిషన్ (FE)’ అయిన గెలాక్సీ S26 FE ఫోన్‌ను సోమవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గతేడాది విడుదల చేసిన S26 మోడల్‌కు తరువాతి వెర్షన్‌గా దీన్ని తీసుకువచ్చింది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్‌తో 6.7 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2X డిస్ప్లే కలిగి ఉంది. OISతో 50 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 8 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరాలు ఉన్నాయి. మూడింతల ఆప్టికల్ జూమ్ వ్యవస్థ ఉంది. 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 17 ఆధారిత One UI 9తో పనిచేస్తుంది. అదేవిధంగా ఈ ఫోన్ Exynos 2500 ప్రాసెసర్, 4900 సామర్థ్యం గల బ్యాటరీని కలిగి ఉంది.
ధర
8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో, పిస్తాచియో (Pistachio), బ్లూబెర్రీ, గ్రాఫైట్ రంగుల్లో లభించే ఈ ఫోన్ ధర రూ. 79,999గా ఉంది. 128 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 69,999. పాత ఫోన్ ఎక్స్చేంజ్ ద్వారా రూ. 8000 తగ్గుతుంది. ప్రముఖ బ్యాంకుల ద్వారా 30 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయంతో పాటు అదనంగా రూ. 3000 బోనస్ పొందే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రముఖ బ్యాంకుల కార్డులపై రూ. 7000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

