El Chapo Isidro | ఎఫ్బీఐ మోస్ట్ వాంటెడ్ జాబితాలోని డ్రగ్ డాన్ ఎల్ చాపో ఇసిద్రో అరెస్ట్..!
El Chapo Isidro | మెక్సికో దేశానికి చెందిన డ్రగ్ డాన్ (Drug Don), ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఎల్ చాపో ఇసిద్రో (El Chapo Isidro) అరెస్టయ్యాడు. మెక్సికో ప్రత్యేక భద్రతా బలగాలు, అమెరికా-మెక్సికో ఆర్మీ చేపట్టిన సంయుక్త ఆపరేషన్లో అతడు పట్టుబడినట్లు సమాచారం. ఈ సందర్భంగా మెక్సికన్ సైన్యానికి, సాయుధ మిలిటెంట్లకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నట్లు తెలిసింది.
El Chapo Isidro : మెక్సికో దేశానికి చెందిన డ్రగ్ డాన్ (Drug Don), ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఎల్ చాపో ఇసిద్రో (El Chapo Isidro) అరెస్టయ్యాడు. మెక్సికో ప్రత్యేక భద్రతా బలగాలు, అమెరికా-మెక్సికో ఆర్మీ చేపట్టిన సంయుక్త ఆపరేషన్లో అతడు పట్టుబడినట్లు సమాచారం. ఈ సందర్భంగా మెక్సికన్ సైన్యానికి, సాయుధ మిలిటెంట్లకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నట్లు తెలిసింది.
శుక్రవారం సినలోవాలో ఎల్ చాపోను పట్టుకున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నేరపూరిత కార్యకలాపాలు సాగిస్తున్న మెజా ఫ్లోరెస్ అనే సంస్థకు ఇసిద్రో నాయకత్వం వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అతడు తలదాచుకున్నట్లు భావిస్తున్న సినలోవాలోని గువాసేవ్ ప్రాంతంలో భద్రతాబలగాలు కాల్పులు జరుపుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఎల్ చాపో అరెస్టు వార్తల నేపథ్యంలో మెక్సికోలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులు రోడ్లను దిగ్బంధించి వాహనాలకు నిప్పుపెట్టారు. భారీ మొత్తంలో మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు కూడా ఇసిద్రోపై ఆరోపణలు ఉన్నాయి. మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలతో సంబంధాలు పెంపొందించుకొని, ఆపై సొంతంగా ఓ ముఠా ఏర్పాటు చేసుకొని ఇసిద్రో కీలక నాయకుడిగా ఎదిగాడు.
ఇసిద్రో అమెరికాలోకి కొకైన్, మెథాంఫెటమైన్, హెరాయిన్ లాంటి మాదక ద్రవ్యాలను చేరవేస్తున్నాడనే ఆరోపణలతో గత ఏడాది ఫిబ్రవరి 4న ఎఫ్బీఐ మోస్ట్ వాంటెడ్ నిందితుల జాబితాలో చేర్చింది. అతడిపై ఐదు మిలియన్ డాలర్ల రివార్డు కూడా ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Chapo Isidro | ఎఫ్బీఐ మోస్ట్ వాంటెడ్ జాబితాలోని డ్రగ్ డాన్ ఎల్ చాపో ఇసిద్రో అరెస్ట్..!
వైద్య సిబ్బందిపై డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ తీవ్ర ఆగ్రహం
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో గోపాలమిత్ర పశువైద్య శిబిరం
Anganwadi Teacher | ఒక్కో అంగన్ వాడీ టీచర్ పోస్టుకు రూ.50 వేల నుంచి రూ.2 లక్షలు..!
గ్రామాల అభివృద్ధికి నిరంతర కృషి : ఎమ్మెల్యే కూనంనేని
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

