వైద్య సిబ్బందిపై డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ తీవ్ర ఆగ్రహం
జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని భద్రాద్రి జిల్లా వైద్యాధికారి డాక్టర్ తుకారాం రాథోడ్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ప్రతాప్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించిన అధికారులు...
– జూలూరుపాడు పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ
జూలూరుపాడు, నవంబర్ 21 : జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని భద్రాద్రి జిల్లా వైద్యాధికారి డాక్టర్ తుకారాం రాథోడ్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ప్రతాప్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించిన అధికారులు, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న వైద్య సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, హెల్త్ సూపర్వైజర్లలో క్షేత్రస్థాయి పర్యవేక్షణ లోపించిందని, వారు సమయ పాలన పాటించడం లేదని మండిపడ్డారు. అదేవిధంగా ఏఎన్ఎంలు సైతం సమయ పాలన పాటించకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. మందుల కొరత తలెత్తకుండా, సకాలంలో మందులు సరఫరా అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ బి.వెంకటేశ్వర్లు, ఫార్మసీ ఆఫీసర్, హెడ్ నర్సు ఇందిర, ఎల్టీ రాము, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

