Ganapati Puja At Police Station | పోలీస్ స్టేషన్లో హోమం.. రేకెత్తించిన రాజకీయ వివాదం
Ganapati Puja At Police Station | బాలిక మిస్సింగ్ కేసుపై ఒత్తిడి, ప్రమాదం వంటి అవాంఛనీయ సంఘటనలకు ఒక పోలీస్ అధికారి కలత చెందారు. ఈ నేపథ్యంలో కొందరి సలహా మేరకు ఏకంగా ఆ పోలీస్ స్టేషన్లో హోమం నిర్వహించారు. దీంతో రాజకీయ వివాదానికి ఇది దారితీసింది.
చెన్నై: బాలిక మిస్సింగ్ కేసుపై ఒత్తిడి, ప్రమాదం వంటి అవాంఛనీయ సంఘటనలకు ఒక పోలీస్ అధికారి కలత చెందారు. ఈ నేపథ్యంలో కొందరి సలహా మేరకు ఏకంగా ఆ పోలీస్ స్టేషన్లో హోమం నిర్వహించారు. దీంతో రాజకీయ వివాదానికి ఇది దారితీసింది. (Ganapati Puja At Police Station) తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నడుపట్టు గ్రామానికి చెందిన రెండో తరగతి చదువుతున్న బాలిక రెండు నెలల కిందట ఇంటి నుంచి అదృశ్యమైంది. ఆ చిన్నారి తల్లిదండ్రులు సత్యమంగళం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమెదు చేసి ఆ బాలిక కోసం వెతికినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. దీంతో ఈ కేసును సీబీ-సీఐడీకి బదిలీ చేశారు.
కాగా. సత్యమంగళం పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్స్పెక్టర్ సురేష్ బాబు ఇటీవల ప్రమాదానికి గురయ్యారు. బాలిక మిస్సింగ్ కేసుతో పాటు గత నెల రోజులుగా ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో మరికొన్ని కేసులతో పాటు అవాంఛనీయ సంఘటనలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఎవరో ఇచ్చిన సలహా మేరకు ఇన్స్పెక్టర్ సురేష్ బాబు ఏకంగా ఆ పోలీస్ స్టేషన్లో తన భార్యతో కలిసి గణపతి హోమం నిర్వహించారు. పోలీస్ సిబ్బంది, పోలీస్ అధికారులు కూడా ఈ పూజలో పాల్గొన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు ఈ సంఘటన తమిళనాడులో రాజకీయ వివాదానికి దారితీసింది. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని డీఎంకే నాయకుడు సెంథిల్‌కుమార్ విమర్శించారు. ‘జ్యోతిష్యుల సలహాల ఆధారంగా పనిచేస్తుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ప్రభుత్వం నుంచి ఏమి ఆశించగలం’ అని ఆయన ప్రశ్నించారు.
అయితే ఈ సంఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. పోలీస్ స్టేషన్ లోపల ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. దీనిపై విచారణ జరుపుతున్నామని, సదరు ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకుంటామని పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు.
#WATCH | A video showing a Ganapathi Homam performed at a police station near #Gingee has gone viral. Reports suggest the ritual was conducted following a series of cases registered at the station, including a missing minor girl case, a death, and an accident. https://t.co/EtcL6u667O
— The Federal (@TheFederal_News) November 21, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన
తుంగతుర్తిలో ఘనంగా మత్స్య కార్మికుల దినోత్సవం
Ganapati Puja At Police Station | పోలీస్ స్టేషన్లో హోమం.. రేకెత్తించిన రాజకీయ వివాదం
AP Student | గుజరాత్‌లోని వడోదరలో ఏపీ విద్యార్థి మృతి
El Chapo Isidro | ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ జాబితాలోని డ్రగ్ డాన్ ఎల్ చాపో ఇసిద్రో అరెస్ట్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

