Tarun Tejpal : అత్యాచారం కేసులో దోషిగా తేలిన తెహెల్కా మాజీ ఎడిటర్, మాజీ మంత్రి తరుణ్ తేజ్‌పాల్(Tarun Tejpal) లొంగిపోయారు. రెండు వారాల్లోగా లొంగిపోవాలని ఆగస్టు 25వ తేదీన సుప్రీం కోర్టు ఆదేశించడంతో సోమవారం గోవా పోలీసులకు ఆయన సరెండర్ అయ్యారు. మపుసాలోని అడిషనల్ సెషన్స్ కోర్టులో లొంగిపోయిన తేజ్పాల్ను కొల్వలే సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు.
మాజీ మంత్రి, తెహెల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ లొంగిపోయారు. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన వినాయక చవితి రోజు గోవాలో సరెండరయ్యారు. కోర్టులో లొంగిపోయిన తేజ్‌పాల్ తాను సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించారు. ‘బాంబే కోర్టు తీర్పుపై మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం. అత్యున్నత ధర్మాసనంలో న్యాయం జరగుతుందని మాకు నమ్మకం ఉంది’ అని తేజ్‌పాల్ అన్నారు.
#WATCH | Goa: Rape convict and former Editor of Tehelka magazine Tarun Tejpal surrenders before Mapusa Court.
Supreme Court ordered the rape convict and former Editor of Tehelka magazine, Tarun Tejpal to surrender within three weeks’ time and to furnish the surrender… pic.twitter.com/7nU1wzyakd
— ANI (@ANI) September 14, 2026
అత్యాచారం కేసులో బాంబే హైకోర్టు విధించిన శిక్షపై ఆయన అప్పీల్ చేసుకోగా అత్యున్నత ధర్మాసనం కొట్టిపారేసింది. ముందుగా లొంగిపోవాలని, ఆ తర్వాతే పిటిషన్‌ను విచారిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది. దాంతో.. గత్యంతరం లేక తేజ్‌పాల్ సోమవారం గోవాలో సరెండర్ అయ్యారు. దాంతో.. 10 ఏళ్ల శిక్ష అనుభవించడం కోసం ఆయనను పోలీసులు నార్త్ గోవాలోని కొల్వలే సెంట్రల్ జైలుకు తరలించారు.
2013 అత్యాచారం కేసులో తరుణ్ తేజ్‌పాల్‌కు బాంబే హైకోర్టు ఆగస్టు 6వ తేదీన పదేళ్ల జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఆ తీర్పును సవాల్ చేసిన ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అడ్వకేట్ ఆదిత్య సమద్దర్ పిటిషన్ దాఖలు చేశారు. తెహల్కా మాజీ ఎడిటర్‌కు శిక్ష విధించాలని గోవా ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆయన పాల్పడిన తీవ్రమైన నేరానికి చాలా తక్కువ శిక్ష విధించినట్లు గోవా సర్కారు అభిప్రాయపడింది. 2013లో తన వద్ద పనిచేస్తున్న జూనియర్ అమ్మాయిని ఓ హోటల్ ఎలివేటర్లో రేప్ చేసినట్లు తేజ్పాల్పై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో తాను రాజకీయ బాధితుడిని అని 62 ఏళ్ల తరుణ్ పేర్కొన్నారు.
VIDEO | Tehelka founder editor Tarun Tejpal surrenders before Goa court after SC refuses respite in sexual assault case; sent to jail.
He says, “I just want to say that we are in the Supreme Court, we are sure the justice will come.”#TarunTejpal pic.twitter.com/4D7QlBjcAT
— Press Trust of India (@PTI_News) September 14, 2026
తరుణ్ తేజ్‌పాల్‌కు 10 ఏండ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 5 లక్షల జరిమానాను విధిస్తూ బాంబే (Bombay) హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. తేజ్‌పాల్ తనపై రేప్ చేశాడని తెహెల్కా (Tehelka) ఉద్యోగిని 2013లో కేసు పెట్టింది. ఆ కేసులో గోవా ప్రభుత్వం అప్పీలుకు వెళ్లింది. విచారణ అనంతరం తేజ్‌పాల్‌కు 10 ఏండ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 5 లక్షల జరిమానా విధించింది బాంబే హైకోర్టు. అంతేకాకుండా రెండు వారాల్లోగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆర్డర్ వేసింది. జస్టిస్ (Justice) నీలా గోఖలే, జస్టిస్ అమిత్ జమ్సాందేకర్లతో కూడిన ధర్మాసనం సెక్షన్ 376(2)(f), 376(2)(k)తో పాటు సెక్షన్ 354A అండ్ 354B కింద అత్యాచారం, లైంగిక వేధింపుల నేరాలకు సంబంధించి తేజ్పాల్ను దోషిగా తేల్చింది.