Drought District | నారాయణపేటను కరువు జిల్లాగా ప్రకటించాలి
Drought District | వర్షాభావంతో పత్తి, ఆముదం, కంది పంటలు ఎండిపోతుండగా, బోరుబావుల్లో నీరు అడుగంటి వరి పంటల పరిస్థితి కూడా దయనీయంగా మారిందని సామాజిక కార్యకర్త హెచ్.నర్సింహా తెలిపారు.
ఊట్కూర్ : వర్షాభావంతో పత్తి, ఆముదం, కంది పంటలు ఎండిపోతుండగా, బోరుబావుల్లో నీరు అడుగంటి వరి పంటల పరిస్థితి కూడా దయనీయంగా మారిందని సామాజిక కార్యకర్త హెచ్.నర్సింహా ( Narasimha ) తెలిపారు. ఈ నేపథ్యంలో నారాయణపేట ( Narayanpet ) జిల్లాను కరువు జిల్లా ( Drought District ) గా ప్రకటించి రైతులను తక్షణమే ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సోమవారం ఊట్కూర్ మండలంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖరీఫ్‌లో వర్షాలు సకాలంలో కురవకపోవడంతో రైతులు పత్తి, ఆముదం, కంది విత్తనాలను ఒకటికి రెండుసార్లు విత్తాల్సి వచ్చిందన్నారు. విత్తిన పంట మొలకెత్తినా, ఆ తర్వాత వర్షం లేకపోవడంతో మొక్కలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి పంట మొగ్గ, పూత, కాయ దశలోనే ఎండిపోతుండటంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు.
విత్తనాలు, రసాయన ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చు కలిపి ఎకరాకు సుమారు రూ.35 వేల వరకు పెట్టుబడి పెడుతున్నారని నర్సింహా తెలిపారు. అయితే పంట దిగుబడి తగ్గిపోవడంతో వచ్చిన పంటను అమ్మినా రూ.15 వేలు కూడా దక్కని పరిస్థితి ఉందన్నారు. గతంలో ఎకరాకు సుమారు 10 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చేదని, ఈసారి ఒకటి, రెండు క్వింటాళ్లకు పరిమితమయ్యే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

