న్యూఢిల్లీ: రష్యా జరిపిన భారీ మిస్సైల్ దాడిలో.. అర్సిలార్ మిట్టల్(ArcelorMittal) కంపెనీ ధ్వంసమైంది. అయితే ఉక్రెయిన్‌లో ఉన్న స్టీల్ ప్లాంట్‌ను పునరుద్దరిస్తున్నట్లు ఆ కంపెనీ తన ప్రకటనలో చెప్పింది. రష్యా క్షిపణ దాడిలో కంపెనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో 13 మంది వర్కర్లు, కాంట్రాక్టర్లు గాయపడ్డారు. దాడి వల్ల ప్రధాని ఉత్పత్తి కేంద్రం, బ్లాస్ట్ ఫార్నన్స్ ప్రొడక్షన్ సెంటర్ డ్యామేజ్ అయ్యాయి. తాజా అటాక్ వల్ల కంపెనీలో స్టీల్ ఉత్పత్తి పాక్షికంగా నిలిపివేశారు.
అయితే ప్రస్తుతం సంబంధిత నిపుణులు డ్యామేజీని అంచనా వేస్తున్నారని, ఆపరేషన్స్‌ను మళ్లీ పునరుద్దరించేందుకు చర్యలు చేపట్టారని అర్సిలార్మిట్టల్ కిరివి రిహ్ కంపెనీ ప్రతినిధి తెలిపారు. దాడి తర్వాత గాలింపు, రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నామన్నారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్లాన్‌ను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఉక్రెయిన్‌లో అర్సిలార్ మిట్టల్ కిరివి రిహ్ అతిపెద్ద స్టీల్ ప్లాంట్. ఈ ప్లాంట్ వ్యూహాత్మక ఆర్థిక, భద్రతా కాంప్లెక్స్‌గా భావిస్తున్నారు.