Asian Games : పద్దెనిమిదో ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు పతక వేటలో దూసుకెళ్తున్నారు. షాట్‌పుటర్ తేజింజర్పాల్ సింగ్ తూర్ (Tajinderpal Singh Toor) పసిడి పోరులో హ్యాట్రిక్ కొట్టలేకపోయాడు. వరసగా రెండు సార్లు గోల్డ్ మెడల్ ఒడిసిపట్టిన అతడు.. ఈసారి వెండిని ముద్దాడాడు. 10 వేల మీటర్లలో సిల్వర్ మెడల్ అందుకున్న గుల్వీర్ సింగ్(Gulveer Singh) 1,500 మీటర్లలోనూ ఫైనల్ చేరాడు. అనిమేశ్ కుజుర్ (Animesh Kujur) సైతం 200 మీటర్ల పరుగులో సత్తా చాటాడు.
జపాన్‌లోని నగోయలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత అథ్లెటిక్స్ జోరు చూపిస్తున్నారు. మిక్స్డ్ రీలే, మారథాన్ పరుగులో పతకాలు కొల్లగొట్టిన అథ్లెట్లు.. షాట్‌ఫుట్, స్ప్రింట్స్లోనూ మెరిశారు. షాట్‌పుట్‌లో వరసగా రెండుసార్లు గోల్డ్ మెడల్ కొల్లగొట్టిన తజిందర్ పాల్ తూర్ ఈసారి మాత్రం వెండి పతకంతోనే సరిపెట్టుకున్నాడు. ఫైనల్లో ఇనుప గుండును 20.64 మీటర్ల దూరం విసిరి అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. కానీ, తజిందర్‌కు షాకిస్తూ మొహమ్మద్రెజా తయబిసే(ఇరాన్)..20.81 మీటర్ల దూరంతో అగ్రస్థానంలో నిలిచాడు.
🚨#News l 🇮🇳Tajinderpal Singh Toor wins SILVER in Men’s Shot Put at Asian Games 🥈
The two-time defending champion couldn’t quite find his best form in the final, throwing best of 20.64m enough for Silver
Iran’s Mohammadreza Tayebise took gold with 20.81m.#AsianGames… pic.twitter.com/LBg7zTTSA6
— The Bridge (@the_bridge_in) September 26, 2026
పురుషుల ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ముగ్గురు అథ్లెట్లు ఫైనల్ చేరారు. 200 మీటర్లలో అనిమేశ్ కుజుర్ అంచనాలు అందుకుంకున్నాడు. నిన్న 100 మీటర్ల పరుగులో తేలిపోయిన అతడు.. శనివారం పట్టుదలతో పరుగు తీసి ఆశలు రేపాడు. ఇక 1,500 మీటర్లలో గుల్వీర్ సింగ్ పసిడి పోరుకు అర్హత సాధించాడు. ఇప్పటికే పది వేల మీటర్లలో రజతంతో మెరిసిన గుల్వీర్.. శనివారం పదిహేను వందల మీటర్లలో 3:45.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని ఫైనల్ బెర్తు పట్టేశాడు.
ANIMESH KUJUR THROUGH to THE FINALS OF THE 200M MEN’S
India’s Animesh Kujur clocked 20.81s to finish 2nd in his heat
Puripol Boonson — 20.10s
Animesh Kujur — 20.81s
Ali Haji — 20.91sBoonson also set a Games Record of 20.10s.#AsianGames2026 #IndianAthletics #Athletics…
— nnis Sports|Asian GamesAthletics (@nnis_sports) September 26, 2026
ఇదే విభాగంలో భారత్‌కే చెందిన యూనుస్ షా 3:45.74 సెకన్లతో ఫైనల్ చేరాడు. అయితే.. కామన్వెల్త్ పతక వీరుడు ప్రవీణ్ చిత్రవేల్ గాయంతో లాంగ్ జంప్ ఫైనల్స్‌కు దూరమయ్యాడు. ప్రవీణ్ బదులు పతకం గెలుస్తాడనుకున్న కార్తిక్ ఉన్నికృష్ణన్ ఆరో స్థానంతో నిరాశపరిచాడు.
🚨 GULVEER & YOONUS MAKE THE 1500M FINAL!
Both Indian runners secure their spots in the 1500m final after finishing 3rd in their respective heats.
🇮🇳 Yoonus Shah – 3:45.77 | 5th
🇮🇳 Gulveer Singh – 3:45.79 | 6thThey’re through to the FINAL! ✅ pic.twitter.com/ccPLUX9Ucz
— The Khel India (@TheKhelIndia) September 26, 2026