హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 2022 ఏప్రిల్ 26న హైదరాబాద్ (సనత్నగర్, అల్వాల్, ఎల్బీనగర్)లో ఒకేరోజు 3 సూపర్ స్పెషాలిటీ దవాఖానల (టిమ్స్) నిర్మాణ పనులు ప్రారంభించగా 30% పనులు మిగిలిపోయాయి. వాటిని పూర్తి చేసి ప్రారంభించాల్సిన కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ వాయిదాలు వేస్తూ ప్రజలకు అసౌకర్యం కల్పిస్తున్నది. ఈ క్రమంలోనే దామోదర రాజనర్సింహ మంగళవారం పనులను పరిశీలించి మరోమారు ఉగాదికి వాయిదా అనడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.