KCR | మర్కూక్, అక్టోబర్ 13: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య దసరా వేడుకలు జరుపుకొన్నారు. శనివారం ఉదయం వ్యవసాయక్షేత్రంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాహనాలకు పూజలు చేయించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపారు. ఈ వేడుకల్లో కేసీఆర్ సతీమణి శోభ, తనయుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కోడలు శైలిమ, మనుమరాలు అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.