సిరిసిల్ల నిర్మల్ అర్బన్ /ఆదిలాబాద్ ఖమ్మం, డిసెంబర్ 30: సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేపట్టిన దీక్షలు సోమవారం 21వ రోజు వినూత్న రీతిలో కొనసాగాయి. సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట వంటావార్పు చేపట్టి రోడ్డుపై భోజనాలు చేశారు. ఆదిలాబాద్‌లోని తెలంగాణ చౌక్ వద్ద కళ్లకు గంతలు కట్టుకొని ఆందోళన తెలిపారు.
నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట యజ్ఞం చేసి నిరసన తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్ ధర్నాచౌక్ వద్ద ఉద్యోగుల సమ్మె శిబిరాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి, జిల్లా నాయకుడు గుండాల కృష్ణ సందర్శించి సంఘీభావం ప్రకటించారు.
హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు సమ్మె విరమిస్తేనే వారి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని మంత్రులు పొన్నం, సీతక్క సూచించారు. సోమవారం వారితో మంత్రులు సమావేశమై మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా సమ్మె విరమించాలని కోరారు.