హైదరాబాద్, ఫిబ్రవరి16 (నమస్తే తెలంగాణ): ఇంటింటి సర్వేలో పాల్గొనని వారికోసం ప్రభుత్వం రీసర్వేను ఆదివారం ప్రారంభించి, ఈ నెల 28 వరకు వివరాల నమోదుకు అవకాశాన్ని కల్పించింది. ఇటీవల నిర్వహించిన సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా 3.1% మంది వివరాలను నమోదు చేసుకోలేదు. వారికోసం ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించి టోల్ ఫ్రీ నంబర్ 040 21111111ను కూడా ఏర్పాటు చేసింది.
మండల కార్యాలయాల్లోని ప్రజాపాలన కేంద్రాలు, ఆన్లైన్ ద్వారా కూ డా కుటుంబ వివరాలు నమోదు చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది. రీ సర్వేకు ప్రజల నుంచి పెద్దగా స్పందన లేదని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.