Telangana | హైదరాబాద్ : గ్రామ సంఘాల సహాయకుల(వీఓఏ)కు తెలంగాణ ప్రభుత్వం రాఖీ పండుగ కానుక అందించింది. వీఓఏల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. రూ. 3,900 నుంచి రూ. 5 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అదనపు సాయం రూ. 3 వేలతో కలిపి నెలకు రూ. 8 వేలు అందుకోనున్నారు వీఓఏలు. ప్రభుత్వ నిర్ణయంతో 17,608 మంది వీఓఏలకు లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా వీఓఏలు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి హరీశ్‌రావుకు రాఖీలు కట్టి మహిళలు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.