హైదరాబాద్, జనవరి4 (నమస్తే తెలంగాణ): ప్రతి నెలా ఒకటవ తేదీనే జీతాలు వేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటలన్నీ ఉత్తముచ్చటగానే మిగిలిపోతున్నాయి. బీసీ, ఎస్సీ, మైనార్టీ గురుకులాల్లోని ఉద్యోగులకు ఇప్పటివరకు వేతనాలను చెల్లించలేదు.
ఎస్సీ సొసైటీలోని పార్ట్‌టైం ఉద్యోగులకైతే దాదాపు 2 నెలలుగా వేతనాలను చెల్లించని దుస్థితి నెలకొన్నది. సొసైటీ పరిధిలోని ఆర్మ్ ఫోర్సెస్ కాలేజీలో పలువురికి 5 నెలలుగా జీతాలను చెల్లించలేదు.