హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): సాధారణ బదిలీల్లో భాగంగా ఇటీవల ఇతర జిల్లాల్లోకి వెళ్లిన సిబ్బందికి జీతాలు, అలవెన్స్లు పెండింగ్లో లేవని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. బదిలీ అయిన సిబ్బందికి భత్యాలు లేవంటూ సోమవారం ‘నమస్తే తెలంగాణ’లో వార్త ప్రచురితమవడంతో వైద్యారోగ్య శాఖ ఈ వివరణ ఇచ్చింది.
బదిలీపై సిద్దిపేట జిల్లాకు వెళ్లిన ఐదుగురు సివిల్ అసిస్టెంట్ సర్జన్లతోపాటు ఇతర జిల్లాల్లోని సిబ్బందికి సైతం సక్రమంగా వేతనాలు అందుతున్నాయని పేర్కొన్నది.