వరంగల్ : మహిళా భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భరోసా కేంద్ర నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూరాష్ట్రంలో అరాచకాలు చేసేవారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మహిళల విషయంలో ప్రజల్లో మార్పు తీసుకురావాలని అధికారులను కోరారు.
రాష్ట్ర పోలీసులు చాకచక్యంగా, పటిష్టంగా పని చేస్తున్నారని ప్రశంసించారు. తన 40 ఏండ్ల సంవత్సరాల రాజకీయ జీవితంలో పోలీసులకు ఇచ్చిన ప్రాధాన్యత గతంలో ఎవరూ ఇవ్వలేదని పేర్కొన్నారు. భరోసా కేంద్రాలకు వచ్చే మహిళలకు అన్ని విధాల సాయం చేయాలని సూచించారు.
ఎంపీ పసునూరి దయాకర్,చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్,మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ తెలంగాణలో పోలీసులు ఫ్రెండ్లీ గా ఉంటున్నారని రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచేందుకు పోలీసులు చేస్తున్న కృషి అద్భుతమని అన్నారు.మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలు, దాడులు జరిగినా 24 గంటల్లో దోషులను పట్టుకుని శిక్షిస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, ఉమెన్స్ సేఫ్టీ వింగ్ డీసీపీ అశోక్, జెమిని సంస్థ ప్రతినిధులు చంద్ర శేఖర్ రెడ్డి, అనురాగ్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.