హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, మహిళలకు గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. పూలను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ ఆడబిడ్డలదని, తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం వల్లే బతుకమ్మను రాష్ట్ర పండగ చేసిందని తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ సంతోషంగా ఈ పండుగను జరుపుకునేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏటా కోటి చీరలను అనేక వర్ణాలతో, వివిధ డిజైన్లతో రూపొందించి తండ్రిగా, అన్నగా, మేనమామగా అందిస్తున్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణలో నేతన్నకు చేతినిండా ప్రభుత్వం పని కల్పిస్తుందన్నారు. అలాగే ఆడబిడ్డలకు నిండు మనసుతో అందించే గొప్ప కానుక బతుకమ్మ చీరలు అన్నారు.
తీరొక్క పూలతో తీరైనా రీతిలో అందంగా పేర్చే బతుకమ్మ మన జీవితంలో అనేక ఆనందాలకు ప్రతీకగా అభివర్ణించారు. ఈ సద్దుల బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డల జీవితాల్లో ఆనందాలను తీసుకురావాలని ఆకాంక్షిస్తూ మరోసారి శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Crime news |కుంటలో పడి యువకుడు మృతి
టీమిండియాకు విదేశీ కోచ్.. చాన్సే లేదంటున్న బీసీసీఐ!
వినూత్నంగా బర్త్డే సెలబ్రేషన్.. 550 కేక్స్ కట్ చేసిన వ్యక్తి