కారేపల్లి, సెప్టెంబర్ 26 : కారేపల్లి మండల పరిధిలోని పోలంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఇటీవల కాలంలో వరుసగా దొంగతనాలు జరుగుతుండడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి కోటిలింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన రేకుల షెడ్డు పైపులను గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో తరలిస్తుండగా ఆలయ చైర్మన్ వెంకటేశ్వర్లు, గ్రామస్తులు గమనించారు. వెంటనే అప్రమత్తమైన వారు ఆటోను వెంబడించి పైపులను తరలిస్తున్న వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలిపారు. అనంతరం ఘటనపై సంబంధిత పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. గ్రామంలో వరుస దొంగతనాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు రాత్రివేళల్లో పోలీసుల గస్తీ పెంచాలని గ్రామస్తులు కోరుతున్నారు.