నిర్మల్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ వద్ద గోదావరి నదిపై నిర్మించిన సదర్మాట్ బరాజ్ పనులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. ఉమ్మడి ఏపీలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2009లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఖానాపూర్‌లో శంకుస్థాపన చేశా రు. తరువాత ఐదేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నా, సదర్మాట్లో తట్టెడు మ ట్టి తీయలేదు, నయాపైసా మంజూరు చేయలేదు. తెలంగాణ సాధించుకున్న తర్వాత కేసీఆర్ ప్రభుత్వమే ప్రాజెక్టును పూర్తి చేసింది. ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాంత రైతుల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకొని 2017 లో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రాజెక్టు నిర్మాణానికి అంకురార్పణ చేశారు. ప్రభుత్వం సదర్మాట్ బరాజ్ నిర్మాణానికి రూ.520 కోట్లు మంజూరు చేసి పనులన్నీ పూర్తి చేసింది. కాంగ్రెస్ ఈ రెండేండ్లలో చివరిదశలో ఉన్న విద్యుదీకరణ పనులు పూర్తిచేసింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి.. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌తో కలిసి శుక్రవారం స్విచ్ ఆన్ చేశారు.
ప్రారంభించేందుకు రెండేండ్లా?
బీఆర్ఎస్ హయాంలోనే దాదాపు పూర్తయిన సదర్మాట్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండేండ్ల సమ యం పట్టింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడిచినప్పటికీ, మిగిలిపోయిన చివరిదశ పనులకు నయాపైసా విడుదల చేయలేదు. దీంతో బీఆర్ఎస్ హయాంలో శరవేగంగా సాగిన పనులన్నీ నిలిచిపోయాయి. దీంతో ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టుదారులు ఆందోళనలకు సిద్ధమయ్యారు. రైతులు ధర్నా లు, రాస్తారోకోలు నిర్వహించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుదీకరణ పనులకు అరకొర నిధులు మంజూరు చేసింది. సర్కార్ అలసత్వంతో పనులు రెండేండ్లపాటు ఆలస్యమయ్యాయని ఈ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. స్థానిక నాయకులు, రైతుల ఒత్తిడి మేరకు ఎట్టకేలకు మిగిలిన పనులను ప్రభుత్వం ఇటీవలే పూర్తిచేసింది. ఈ ప్రాజెక్టు కింద 18 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందనున్నది. నిర్మల్ జిల్లాలో 13,120 ఎకరాలు, జగిత్యాల జిల్లాలో ఐదు వేల ఎకరాలకు ప్రయోజనం కలుగనున్నది. ప్రాజెక్టు పనులు చేపట్టిన ఏజెన్సీకి గత కేసీఆర్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు బిల్లులను చెల్లించడంతో పనులు వేగంగా పూర్తయ్యాయి.
520 కోట్లు వ్యయం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం
రైతులకు సాగునీరందించాలన్న సదాశయంతో చేపట్టిన సదర్మాట్ ప్రాజెక్టు నిర్మాణాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. భూ సేకరణ నుంచి మొదలుకొని పనులు పూర్తయ్యే వరకు మహాయజ్ఞంలా చేపట్టింది. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహించి పనులు వేగంగా జరిగేలా అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కృషి చేశారు. ప్రాజెక్టు వద్ద పెద్దఎత్తున కాంక్రీ టు పనులతోపాటు క్రస్ట్ గేట్ల బిగింపు పనులను నిర్దేశిత గడువులోగా పూర్తిచేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.520 కోట్లు ఖర్చు చేసింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం 1,176 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించగా, ఇందు లో ఇంకా 55 ఎకరాల భూ సేకరణ పెండింగ్‌లో ఉన్నది. గతంలో ఎన్నడూలేని విధంగా ఎకరాకు రూ.10 లక్షల చొప్పున బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు రూ.116 కోట్ల పరిహారా న్ని రైతులకు అందజేసింది. ఎట్టకేలకు ప్రాజెక్టు పనులు పూర్తయి యాసంగి పంటలకు నీరందనుండటంతో ఆయకట్టు రైతులు నాడు కేసీఆర్ చేసిన మేలు గుర్తుచేసుకుంటున్నారు.
కేసీఆర్ కృషితోనే సాధ్యమైంది
కేసీఆర్ కృషితోనే సదర్మాట్ బరాజ్ నిర్మాణం సాధ్యమైంది. ఇప్పటివరకు వానకాలం పంటకు మాత్రమే గ్యారెంటీ ఉండేది. యాసంగిలో చివరి ఆయకట్టుకు నీరందేది కాదు. పాత ఆనకట్ట నిర్మించిన స్థలం గోదావరిలోని ఒక పాయలో ఉండటం వల్ల నీరు ఎక్కువగా నిలువ ఉండేది కాదు. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టును గోదావరి రెండు పాయలుగా విడిపోక ముందే పొన్కల్ వద్ద కట్టారు. కేసీఆర్‌కు ఈ ప్రాంత రైతులు రుణపడి ఉంటారు. ప్రస్తుతం ఉన్న కాలువను కొత్తగా కట్టిన బరాజ్‌తో అనుసంధానం చేసే పనులు తొందరగా పూర్తి చేయాలి. అప్పుడే పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందే అవకాశం ఉంటుంది. – పంబాల భీమేశ్, రైతు, ఖానాపూర్, నిర్మల్ జిల్లా