అసెంబ్లీలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ భగ్గుమన్నది. ఈ మేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. ఆయా జిల్లాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. కొన్ని చోట్ల దిష్టిబొమ్మల దహనాన్ని పోలీసులు అడ్డుకోగా కొంత ఉద్రిక్తత చోటుచేసుకున్నది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసే క్రమంలో బీఆర్ఎస్ నాయకుడు మైలారం రాము ఒంటిపై డీజిల్ పోసుకున్నాడు. గమనించిన బీఆర్ఎస్ నాయకులు వెంటనే అతని అడ్డుకున్నారు.
హనుమకొండలోని కాళోజీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకునేందుకు యత్నించగా కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ఈ క్రమంలో అక్కడున్న మహిళా కార్యకర్తకు నిప్పంటుకొని స్వల్ప గాయాలయ్యాయి. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో నిరసనకు సిద్ధమైన పార్టీ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మండిపడ్డారు. ప్రజాపాలనలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు.
-న్యూస్‌నెట్‌వర్క్
నల్లగొండ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టకుండా పోలీసులు తీసుకెళ్తున్న దృశ్యం
సూర్యాపేటలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయకుండా మహిళలను అడ్డుకుంటున్న పోలీసులు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో సీఎం దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకుంటున్న పోలీసు అధికారులు
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సీఎం దిష్టిబొమ్మను తగలబెట్టడానికి ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తల చేతుల్లోంచి లాక్కెళ్తున్న పోలీసులు
ఖమ్మం జిల్లా కేంద్రంలో సీఎం, డిప్యూటీ సీఎం వ్యాఖ్యలకు నిరసనగా సీఎం చిత్రపటానికి నిప్పంటిస్తున్న బీఆర్ఎస్ నాయకులు
యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రిన్స్ చౌరస్తాలో సీఎం దిష్టిబొమ్మకు నిప్పంటించి కాళ్లతో తొక్కుతున్న బీఆర్ఎస్ నాయకులు
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిజాం కాలేజీ నుంచి అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన బీఆర్ఎస్వీ నాయకులను తాళ్లతో కట్టి వ్యాన్‌లోకి ఎక్కిస్తున్న పోలీసులు
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో సీఎం దిష్టిబొమ్మను తగలబెడుతున్న బీఆర్ఎస్ నాయకులు
సీఎం వ్యాఖ్యలపై సిద్దిపేటలో నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో సీఎం చిత్రపటంతో నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నాయకులు, పాల్గొన్న మేయర్ సునీల్‌రావు, చల్లారి శంకర్ తదితరులు
వరంగల్ చౌరస్తాలో నినాదాలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తదితరులు
ఖమ్మం జడ్పీ సెంటర్లో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా నినాదాలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు
నల్లగొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం ముందు భారీ నల్లజెండాతో నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నాయకులు
హైదరాబాద్‌లోని మియాపూర్ చౌరస్తాలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నాయకులు, పార్టీ శ్రేణులు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కైలాస్‌నగర్‌లో సీఎం చిత్రపటాన్ని చెప్పుతో కొడుతున్న బీఆర్ఎస్ నాయకురాలు, చిత్రంలో మాజీ మంత్రి జోగు రామన్న తదితరులు
మెదక్ జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు, దిష్టిబొమ్మను కాలితో తన్నుతున్న కార్యకర్త
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓవర్ బ్రిడ్జి వద్ద మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓవర్ బ్రిడ్జి వద్ద మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు ఆధ్వర్యంలో నిరసన