రంగారెడ్డి, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ)/ ఇబ్రహీంప ట్నం : భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదేనని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికకు వారు పార్టీ పరిశీలకులుగా వచ్చి మాట్లాడారు. అధికారపార్టీ నేతల అరాచకాలను తప్పుపట్టిన అధికారులు, న్యాయమూర్తులు ప్రజాస్వామ్యాన్ని కాపాడినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్‌కు బలం లేకపోయినా అధికార దుర్వినియోగంతో మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకోవడం కోసం కుట్ర లు, కుతంత్రాలు పన్నిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ కౌ న్సిలర్లు మాత్రం 50రోజుల పాటు పట్టుదలతో పార్టీని గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడారని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించి కేసీఆర్ మూడోసారి సీఎం కావడం ఖాయమని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి క్యామ మల్లేశ్, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.