SCR | హైదరాబాద్ : శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రత్యేక రైళ్లల్లో కొన్నింటిని రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కొన్ని సర్వీసులకు ఇప్పటి వరకు ఎలాంటి బుకింగ్స్ చేసుకోలేదని, రద్దీ లేకపోవడం కారణంగానే కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.
జనవరి 24న వెళ్లాల్సిన మౌలాలి – కొట్టాయం(07167), జనవరి 25న కొట్టాయం – మౌలాలి(07168), మౌలాలి – కొల్లాం(07171), జనవరి 27న కొల్లాం – మౌలాలి(07172), జనవరి 26న కాచిగూడ – కొట్టాయం(07169), జనవరి 27న కొట్టాయం – కాచిగూడ(07170), నర్సాపూర్ – కొల్లాం(07157), జనవరి 29న కొల్లాం – నర్సాపూర్(07158), జనవరి 28న హైదరాబాద్ – కొట్టాయం(07065) ప్రత్యేక రైళ్లను రద్దు చేశారు.
వీటితో ఇతర శబరిమల ప్రత్యేక రైళ్లు.. జనవరి 29న కొట్టాయం – సికింద్రాబాద్(07066), జనవరి 31న మౌలాలి – కొట్టాయం(07167), ఫిబ్రవరి 1న కొట్టాయం – మౌలాలి(07168), జనవరి 24న సిర్పూర్ కాగజ్నగర్(07161), జనవరి 26న కొల్లాం – సిర్పూర్ కాగజ్నగర్(07162) రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
TG TET 2024 | ఇంత నిర్లక్ష్యమా..? ఇంకా విడుదల కాని టెట్ హాల్ టికెట్స్..!