చౌటుప్పల్, జూలై 25 : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోమారు సం చలన వ్యాఖ్యలు చేశా రు. గురువారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం పొర్లగడ్డ తండాలో పర్యటించిన సందర్భంగా సర్కార్ తీరును ఎండగట్టారు. ‘రైతుబంధు అందరికీ రాలేదు. కొందరికే వచ్చిందని నేనూ ఒప్పుకుంట.. సీఎం త ప్పు మాట్లాడినా నిర్మోహమాటంగా చెప్పేస్తా’ అని పేర్కొన్నారు.
ఇటీవల రేవంత్‌రెడ్డి 10 ఏండ్లు సీఎంగా ఉంటానంటే అది తప్పంటూ ట్వీట్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. మనకు మంచి రోజులు రాబోతున్నాయంటూ చెప్పుకొచ్చారు. కాం గ్రెస్ పెద్దలు, సీఎం తీరువల్లే తనకు మంత్రి పదవి రావడంలేదంటూ ఆయన రగిలిపోతున్నట్టు ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.