ఖమ్మం, మార్చి 5: నగరంలోని వ్యవసాయ మార్కెట్ మిర్చి యార్డులో దళారీల దోపిడీని అరికట్టాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా కమిటీలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఖమ్మంలోని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంప్ కార్యాలయాన్ని మంగళవారం ముట్టడించాయి.
ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న, న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు అవునూరి మధు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పంట ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించి స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు డేవిడ్కుమార్, రాజేంద్రప్రసాద్, వెంకట్రామిరెడ్డి, ప్రకాశ్, వెంకన్న, జీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.