BRS | షాబాద్, జనవరి 16 : బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేడు షాబాద్‌లో నిర్వహించే రైతుధర్నాను విజయవంతం చేయాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ యువనేత పట్నం అవినాశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రైతుధర్నాకు సంబంధించిన సభ స్థలాన్ని, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… శుక్రవారం ఉదయం 11గంటలకు షాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించే రైతుధర్నా కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, పార్టీ శ్రేణులు హాజరుకానున్నట్లు తెలిపారు.
జగిత్యాల రూరల్, జనవరి 16: మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కవిత సుదీర్ఘ పోరాట ఫలితమే పసుసుబోర్డు ఏర్పాటు అని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి పసుపు క్షేత్రంలో గురువారం రైతులతో కలిసి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కవిత నాయకత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా సార్లు కేంద్ర మంత్రులను కలిశారని వసంత గుర్తుచేశారు. పసుపు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి, కనీస మద్దతు ధర క్విం టాలుకు రూ.15 వేలు ఉండేలా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.