Minister Tummala | హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రైతు భరోసా మార్గదర్శకాలింకా సిద్ధం చేయలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అసెంబ్లీలో ప్రకటించారు. రైతు భరోసాపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చను ప్రారంభించిన మంత్రి రైతుబం ధు అమలు తీరును సభలో వివరించా రు. విధివిధినాల రూపకల్పనకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతో ఆర్థికశాఖ మంత్రి ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ వేసినట్టు తెలిపారు. సాగుచేసే భూములకు మాత్రమే రైతుభరోసా ఇచ్చే విషయాన్ని అధ్యయనం చేయాలని సూచించినట్టు చెప్పారు. సంక్రాతికల్లా రైతుభరోసాను అందజేయనున్నట్టు ప్రకటించారు. అ యితే సభ నుంచి ఆశించిన సలహాలు, సూచనలు రాలేదని పేర్కొన్నారు.