హైదరాబాద్, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ ): రైతుబంధు, నేడు రైతుభరోసా పథకాలు రైతాంగానికి ఎంతో మేలు చేసేవేనని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వివరించారు. సాగు భూములకు మాత్రమే రైతుభరోసాను అందించాలని కోరారు. కౌలు రైతులకు కూడా రైతుభరోసాను అందించాలని డిమాండ్ చేశా రు. పంటలకు మద్దతు ధర కాకుండాఎంఎస్ స్వామినాథన్ సిఫారసుల మేర కు గిట్టుబాటు ధర కల్పించాలని, పంట ల బీమా అమలు చేయాలని కోరారు.