నేటి నుంచి 10 వరకు రైతుబంధు ఉత్సవాలు
10వ తేదీ నాటికి రైతుల ఖాతాల్లో 50,000 కోట్లు
చరిత్ర లిఖించిన పథకంపై చెరగని ముద్ర
విద్యార్థులకు పోటీలు.. ముంగిళ్లలో ముగ్గులు
రైతు వేదికల్లో రైతుల ఆత్మీయ సమ్మేళనాలు
10న రాష్ట్రమంతా ఘనంగా వేడుకలు
వారోత్సవాల్లో ఎమ్మెల్యేలు కీలకం: మంత్రి కేటీఆర్
8 విడతలు.. 50,682.30 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం 2018 వానకాలంలో ప్రారంభించిన రైతుబంధు ద్వారా ఈ యాసంగి దాకా నాలుగేండ్లలో 8 సీజన్లకు రైతాంగానికి రూ.50,682.30 కోట్లు పంట పెట్టుబడిగా ఇచ్చింది. ప్రస్తుతం 8వ విడత సొమ్ము రైతుల ఖాతాల్లో జమ అవుతున్నది. ఈ సీజన్లో గత నెల 28న ప్రారంభమైన రైతుబంధు పంపిణీ ఈ నెల 10 వరకు కొనసాగుతుంది.
హైదరాబాద్, జనవరి 2 : సోమవారం నుంచి ఈ నెల 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు వారోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. పథకం ప్రారంభమైనప్పటి నుంచి పంట పెట్టుబడి కోసం రైతుల బ్యాంకు ఖాతాల్లో వేస్తున్న డబ్బు ఈ నెల పదో తేదీనాటికి రూ.50 వేల కోట్లకు చేరనున్నదని వెల్లడించారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగానీ ప్రధానమంత్రిగానీ ఎన్నడూ ఆలోచించని స్థాయిలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీసుకొన్న గొప్ప కార్యక్రమం రైతుబంధు అని పేర్కొన్నారు. ఆదివారం వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్పర్సన్లు, రైతుబంధుసమితి జిల్లా అధ్యక్షులు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్పర్సన్లతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రైతుబంధు ప్రారంభమైనప్పటి నుంచి రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఈ పథకం గొప్ప ఊతంగా మారిందని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడ కూడా రైతుబంధు తరహా పథకాలతో ప్రభుత్వాలు రైతులను ఆదుకొన్న దాఖలాలు లేవని, ఆ ఘనత తెలంగాణ రాష్ర్టానికే సొంతమని వెల్లడించారు. ఈ అరుదైన సందర్భాన్ని పురస్కరించుకొని అంబరాన్నంటేలా సంబురాలు నిర్వహించి, ప్రతిఒక్కరికీ రైతుబంధు ప్రత్యేకత అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు. రాష్ట్రంలోని పల్లెలన్నింటిలో 10వ తేదీవరకు పండుగ వాతావరణం నెలకొనేలా కార్యాచరణ ఉండాలని స్పష్టంచేశారు. అదే సమయంలో కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు.
అరుదైన సందర్భం.. అబ్బురపడే వేడుక
ఒక పథకం ద్వారా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.50 వేల కోట్లు చేరిన సందర్భం దేశ చరిత్రలో ఎన్నడూ లేదని, ఇది అద్భుత సందర్భమని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం నుంచి చిన్న సాగునీటి వనరులైన చెరువుల బలోపేతం వరకు, రైతుబంధు, రైతుబీమా నుంచి రైతు వేదికల వరకు రైతుల కోసం కవీవినీ ఎరుగని రీతిలో కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఇవన్నీ సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన గొప్ప వరాలని పేర్కొన్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు రైతుబంధు సంబురాలను ముం దుండి, అందరినీ కలుపుకొని విజయవంతంచేయాలని సూచించారు. ఉన్నతపాఠశాల విద్యార్థులకు, మహిళలకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించాలని కోరారు. వారంపాటు ఏ రోజు ఏ కార్యక్రమం నిర్వహించాలనే అంశాలను మంత్రి కేటీఆర్ వివరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఇంటిముందు రైతుబంధు ముగ్గులు వేసేలా మహిళలను ప్రోత్సహించాలని సూచించారు. విద్యార్థులు, మహిళలకు సంబురాల నిర్వహణలో ప్రాధాన్యం ఇవ్వటంవల్ల భవిష్యత్ తరానికి ఈ పథకంపై సంపూర్ణ అవగాహన కలుగుతుందని చెప్పారు. రాష్ట్రంలోని 2,500 రైతు వేదికలు కేంద్రంతో రైతులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రతి గ్రామంలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ఊరేగింపులతో 10న సంబురాల ముగింపు కార్యక్రమం అంబరాన్ని తాకేలా నిర్వహించాలని ఆదేశించారు. సంబురాలను స్థానిక మీడియా, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంచేయాలని సూచించారు. నియోజకవర్గాల్లో రైతులకు అందిన నిధుల వివరాలతోపాటు ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో కరపత్రాలను పంపిణీచేయాలని కోరారు. స్థానిక ప్రజలందరికీ చేరేలా ఎమ్మెల్యేలు రైతుబంధు లేఖలు రాయాలని ఆదేశించారు. గత ఏడేండ్లలో వ్యవసాయరంగంలో అసాధారణ విజయాలు సాధించామని, వాటిని మరింత ప్రతిభావంతంగా చెప్పుకోవాలని అన్నారు. ఇందుకోసం అన్ని స్థాయిల పార్టీ శ్రేణులు పోటీపడాలని పిలుపునిచ్చారు.
కొత్తతరాన్ని సాగువైపు మళ్లించిన ఘనత సీఎం కేసీఆర్‌దే: మంత్రి నిరంజన్‌రెడ్డి
శాస్త్ర, సాంకేతికరంగంలో స్థిరపడాలని కలలుకంటున్న యువతరాన్ని వ్యవసాయ రంగంవైపు మళ్లించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతుబంధు సం బురాలకు సంబంధించి ఎటువంటి సమాచారాన్నైనా వ్యవసాయశాఖ అందిస్తుందని ఆయన తెలిపారు. సంబురాలకోసం ప్రచార, సమాచార సామగ్రిని సిద్ధం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. 63 లక్షలమంది రైతులకు రైతుబంధు అందిస్తున్నామని పేర్కొన్నారు. అత్యధిక జనాభాకు ఉపాధి ఇవ్వగల వ్యవసాయరంగాన్ని ఎంత పటిష్ఠం చేస్తే అంత మంచిదని తలచిన సీఎం కేసీఆర్, దూరదృష్టి, దార్శనికతతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు.
వారోత్సవాల్లో నిర్వహించే కార్యక్రమాలు (3 నుంచి 7 వరకు)