Congress | హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): వంద ఎలుకలను తిన్న పిల్లి పుణ్యం కోసం తీర్థయాత్రలకు పోయిన చందంగా ఉన్నది ఇప్పు డు కాంగ్రెస్ వైఖరి. తెలంగాణ నీటి హక్కులను అడుగడుగునా కాలరాసి ఇప్పుడు తామే జలహక్కులను రక్షిస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్న ది. నిస్సిగ్గుగా తాము చేసిన పాపాలన్నింటినీ బీఆర్ఎస్పై వేసేందుకు పూనుకున్నది. అందుకు సెక్ష న్-3 అంశమే నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుం ది. నదీజలాల హక్కులకు సంబంధించి తెలంగాణకు ద్రోహం తలపెట్టేలా సెక్షన్-89ను పొందుపరుస్తూ ఏపీ పునర్విభజన చట్టాన్ని రూపొందించిందే కాంగ్రెస్. చట్టంతో ఒనగూరేది ఏమీ లేదని సెక్షన్-3 ద్వారా జలాల పునఃపంపిణీ చేపట్టాలని అలుపెరగకుండా పోరాడి, కేంద్రంపై ఒత్తిడి తె చ్చింది కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభు త్వం. కానీ ఇప్పుడు అంతా తామే చేశామంటూ కాంగ్రెస్ జబ్బలు చరుచుకోవడం అటుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ అభాండాలు వేయడంపై తెలంగాణవాదులు, నిపుణులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
అనాడు చట్టం చేసిందే కాంగ్రెస్..
ఏపీ పునర్విభజన చట్టం రూపంలో తెలంగాణకు తీరని ద్రోహాన్ని తలపెట్టింది కాంగ్రెస్సే. వాస్తవంగా నది పరీవాహక ప్రాంత విస్తీర్ణం, భౌగోళిక, వాతావరణం ప్రాతిపదికన రాష్ర్టాలకు నదీ జలాల్లో వాటాను కేటాయిస్తారు. కేంద్రంలోని నాటి యూపీఏ సర్కారు అందుకు విరుద్ధంగా ఏపీ పునర్విభజన చట్టం 2014ను రూ పొందించింది. జలాలను పునఃపంపిణీ చేయాలని ఎక్కడా నిర్దేశించలేదు. పూర్తి విరుద్ధంగా చట్టంలో సెక్షన్-89 నిబంధనను పొందుపరచిం ది. ఆయా రాష్ర్టాల వినియోగంలో ఉన్న నదీ జలాలను మాత్రమే ప్రాజెక్టుల వారీగా పంపిణీ చేయాలని నిర్దేశించింది. అప్పటికే కొనసాగుతు న్న బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కే ఆ బాధ్యతను అ ప్పగించింది. సాగునీటి ప్రాజెక్టుల అంశం రాష్ట్ర జాబితాలో ఉండగా, దానిని కేంద్రం చేతిలో పె ట్టింది. బోర్డులను ఏర్పాటుచేసి, ప్రాజెక్టులు ని ర్వహించాలని నిర్దేశించింది. సెక్షన్-89 ప్రకారం తెలంగాణ, ఏపీలకు న్యాయమైన నీటిపంపకాల ను చేసే అధికారాలు తమకు లేవని కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్-2 చైర్మన్ బ్రిజేశ్‌కుమార్ సైతం తేల్చిచెప్పారంటే తెలంగాణకు కాంగ్రెస్ తలపెట్టిన విద్రోహం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. పునర్విభజన చట్టాన్ని అనుసరించే కేంద్రంలోని బీజేపీ సర్కారు రివర్ బోర్డుల గెజిట్‌ను విడుదల చేసింది. ప్రాజెక్టుల స్వాధీనానికి పూనుకున్నది. ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణ నీటిహక్కులను పూర్తిగా కాలరాసింది. దౌర్జన్యం గా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ విస్తరణను నాటి సీఎం వైఎస్ చేపట్టినా కాంగ్రెస్ నేతలు నోరెమెదపలేదు. నదీజలాల వాటాల్లో, ప్రాజెక్టుల నిర్మాణంలో వాటిల్లుతున్న నష్టాన్ని ప్రశ్నించలేదు.
తొమ్మిదిన్నరేండ్లు కేసీఆర్ పోరాటం..
సెక్షన్-89 ప్రకారం నదీ జలాల పంపిణీ చేపడితే తెలంగాణకు ఒరిగేదేమీ ఉండబోదు. ఉద్యమంలో ప్రతిధ్వనించిన న్యాయమైన నీళ్ల వాటా ఆకాంక్ష నెరవేరబోదని ఆదిలోనే నాటిటీ సీఎం కేసీఆర్ గుర్తించారు. ఈ నేపథ్యంలోనే పరివాహక ప్రాంతం ఆధారంగా నీటివాటాలను తేల్చాలన్న డిమాండ్‌ను ముందుపెట్టారు. రాష్ట్ర ఏర్పా టు అనంతరం, తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ సర్కారు దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం 1956లో సెక్షన్-3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి న్యాయమైన నీటి వాటా తేల్చాలని వినతిపత్రం అందజేశారు. అ యినప్పటికీ కేంద్రం ఆ దిశగా చర్యలు చేపట్టకుండా కాలయాపన చేయడంతో సుప్రీంకోర్టు ను ఆశ్రయించారు. ఆ తరువాత తెలంగాణ ఎన్నిలేఖలు రాసినా కేంద్రం స్పందించలేదు. అక్టోబర్ 6, 2020లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సీఎం కేసీఆర్ ట్రిబ్యునల్ అంశం పై పట్టుబట్టారు.
దీంతో కేంద్రం ఎట్టకేలకు ట్రి బ్యునల్ ఏర్పాటుకు అంగీకరించింది. కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలా? లేదంటే ప్రస్తుతమున్న బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కే సెక్ష న్-3 ప్రకారం నీటి వాటాలు పంపిణీ చేసే అధికారాలను కల్పించాలా? అనేదానిపై న్యాయశాఖ సలహాను తీసుకోవాలని నిర్ణయించింది. అదీగాక మళ్లీ ఒక మెలిక పెట్టింది. ట్రిబ్యునల్ ఏర్పాటును కోరుతూ సుప్రీంకోర్టులో వేసిన కేసును తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకోవాల ని, ఆ తర్వాతనే న్యాయసలహా కోరతామని షర తు విధించింది. కేంద్రం సూచనల మేరకు తెలంగాణ ప్రభుత్వం కేసును ఉపసంహరించుకుంది. ఏడాదిన్నర గడిచినా కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పదేపదే లేఖలు రాస్తూ ఒత్తిడి తెచ్చింది. ఎట్టకేలకు కేంద్ర సర్కారు దిగివచ్చి సెక్షన్-3 ప్రకారం జలాల పునఃపంపిణీ చేయాలని ట్రిబ్యునల్ -2కు కొత్తగా టీవోఆర్‌ను జారీచేసింది. న్యాయశాఖ సలహా మేరకు కృష్ణా జలాల పునఃపంపిణీ అంశాన్ని తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించింది. అదీగాక కొత్తగా టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని, కృష్ణా నదీ జలాల వినియోగం, పంపిణీ, నియంత్రణ తదితర అంశాల్లో నెలకొన్న వివాదాలకు పరిషారం చూపుతుందని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం సెక్షన్-3 ప్రకారమే విచారణ కొనసాగుతున్నది.
తేదీల వారీగా కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి..