హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : ఎలక్ట్రిక్ బస్సుల విధానంలో మార్పులు తీసుకొచ్చి ఆర్టీసీకి అవకాశం ఇవ్వాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు అధ్యక్షతన మంగళవారం సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో ఆఫీస్ బేరర్స్ సమావేశం జరిగింది. ఎలక్ట్రిక్ బస్సుల విధానంపై ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనపై సమావేశం లోతుగా చర్చించింది. ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్ రావులు మాట్లాడుతూ.. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్(జీసీసీ) పద్ధతిలో ప్రైవేట్ సంస్థలకు సబ్సిడీలు ఇచ్చి ఆర్టీసీలు నేరుగా ఎలక్ట్రిక్ బస్సులు పొందేందుకు అనుమతించకుండా కేంద్రం కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు.
మౌలిక వసతులకు నిధుల సమీకరణ పేరుతో ప్రజలపై భారం వేయడం సరైనది కా దని ఎస్‌డబ్ల్యూఎఫ్ అభిప్రాయపడింది. అన్ని ప్రాంతాల్లో తిరుగుతున్న ఎలక్ట్రిక్ బస్సుల్లో అదనంగా రూ.10, రూ.20లు చార్జీ చెల్లిస్తున్నారని, ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా అ న్ని డీజిల్, ఎలక్ట్రిక్ బస్సుల్లో అదనంగా వసూలు చేయడం సరికాదని పేర్కొన్నారు.
మహాలక్ష్మి పథకంతో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేస్తున్నదని మాజీ ఎమ్మె ల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. మంగళ వారం ఆయన మాట్లాడుతూ.. ఈ పథకాన్ని అమలుచేసే సత్తాలేకనే చార్జీలు పెంచిందని ధ్వజమెత్తారు. ‘పురుషుల నుంచి ఎక్కువ మొత్తంలో చార్జీలు వసూలు చేసి మహిళలకు ఉచిత ప్రయాణమేంటని ప్రశ్నించారు.