డ్రైవర్‌ది ప్రభుత్వ హత్యే! : ఎంపీ లక్ష్మణ్
వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్‌ది కాంగ్రెస్ ప్రభుత్వ హత్యేనని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్ ఆరోపించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్‌ది కాంగ్రెస్ ప్రభుత్వ హత్యేనని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్ ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గత రెండేండ్లుగా కార్మికులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నా.. ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం కార్మికులను బెదిరించడం, మానసిక వేదనకు గురిచేయడం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి, మాట తప్పి ఎందుకు ముఖం చాటేస్తున్నారని నిలదీశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

