కోటి పరిహారం ఇవ్వాలి: పద్మాదేవేందర్‌రెడ్డి
ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతి బాధాకరమని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతి బాధాకరమని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆమె పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని, పోరాడి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. కార్మికులు ఎవరూ ఆందోళన చెందవద్దని, న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు చొరవ చూపకపోవడంతోనే శంకర్‌గౌడ్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, డ్రైవర్ శంకర్‌గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

