Stock Markets | ఒడిదొడుకుల నడుమ కొనసాగి చివరికి లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..!
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) ట్రేడింగ్ బుధవారం ఒడిదుడుకుల మధ్య కొనసాగి చివరికి లాభాలతో ముగిసింది. కొత్తగా అమల్లోకి వచ్చిన క్లోజింగ్ సెషన్ (Closing Session) ఆక్షన్ విధానం కారణంగా ట్రేడింగ్ చివరి గంటలో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపించినప్పటికీ కొనుగోళ్ల మద్దతుతో సూచీలు లాభాల్లో నిలిచాయి.
Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) ట్రేడింగ్ బుధవారం ఒడిదుడుకుల మధ్య కొనసాగి చివరికి లాభాలతో ముగిసింది. కొత్తగా అమల్లోకి వచ్చిన క్లోజింగ్ సెషన్ (Closing Session) ఆక్షన్ విధానం కారణంగా ట్రేడింగ్ చివరి గంటలో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపించినప్పటికీ కొనుగోళ్ల మద్దతుతో సూచీలు లాభాల్లో నిలిచాయి. సెన్సెక్స్ (Sensex) 152 పాయింట్లు పెరిగి 78,581 వద్ద ముగిశాయి. నిఫ్టీ-50 (Nifty-50) 10 పాయింట్లు లాభపడి 24,625 వద్ద స్థిరపడింది. మార్కెట్లో అస్థిరతను సూచించే ఇండియా వీఐఎక్స్ (India VIX) 1.5 శాతం తగ్గి 12 వద్దకు చేరింది.
అల్ట్రాటెక్ సిమెంట్ 2 శాతానికి పైగా పెరిగి సెన్సెక్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఎన్టీపీసీ, ఎస్బీఐ, మహీంద్రా & మహీంద్రా షేర్లు దాదాపు 2 శాతం చొప్పున లాభపడ్డాయి. ఇండిగో, కోటక్ మహీంద్రా బ్యాంక్, ట్రెంట్, ఎల్ & టీ షేర్లు కూడా ఒక శాతానికి పైగా పెరిగాయి. మరోవైపు టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఒక్కో శాతానికి పైగా పడిపోయి ప్రధాన నష్టాల్లో నిలిచాయి. అలాగే టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ షేర్లు కూడా స్వల్ప నష్టాలను నమోదు చేశాయి.
విదేశీ మారక మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి 0.3 శాతం బలపడి 95.1175 వద్ద ముగిసింది. అంతకుముందు ముగింపు విలువ 95.3775 గా నమోదైంది. అమెరికా ఫ్యూచర్స్, ఆసియా మార్కెట్లు కూడా బలంగా ట్రేడ్ అయ్యాయి. MSCI ఆసియా పసిఫిక్ సూచీ 2.2 శాతం, జపాన్ TOPIX 2 శాతం, షాంఘై కాంపోజిట్ 1.6 శాతం, ఆస్ట్రేలియా S&P/ASX 200 సూచీ 0.9 శాతం మేర పెరిగాయి. ఈ సానుకూల సంకేతాలు భారత మార్కెట్‌కు కూడా మద్దతుగా నిలిచాయి.
కొత్తగా అమలు చేసిన క్లోజింగ్ సెషన్ వేలం విధానం కారణంగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈల మధ్య ముగింపు ధరలలో వ్యత్యాసాలు కనిపించాయి. ఈ రెండు ఎక్స్ఛేంజీలలోని ఆర్డర్ బుక్‌లు వేర్వేరుగా ఉండటమే ఈ తేడాలకు కారణమని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ట్రేడర్లు, సంస్థాగత పెట్టుబడిదారులు ఈ కొత్త వ్యవస్థకు అలవాటు పడిన కొద్దీ, కాలక్రమేణా ఈ వ్యత్యాసాలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్లంబర్ విమానాన్ని దించగలడా?
కశ్మీర్ బస్సులపై రెండ్రోజుల్లో రెండు దాడులు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

