మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Sep 23, 2020 , 13:33:14

న‌గ‌ర శివార్ల‌లో రోడ్డెక్కిన ఆర్టీసీ బ‌స్సులు

న‌గ‌ర శివార్ల‌లో రోడ్డెక్కిన ఆర్టీసీ బ‌స్సులు

హైద‌రాబాద్ : న‌గ‌ర శివార్ల‌లో ఆర్టీసీ బ‌స్సులు రోడ్డెక్కాయి. దాదాపు ఆరు నెల‌ల త‌ర్వాత న‌గ‌ర శివార్ల‌లో ఆర్టీసీ స‌బ‌ర్బ‌న్, ముఫిసిల్ బ‌స్సు స‌ర్వీసులు ప‌రుగులు పెడుతున్నాయి. బుధ‌వారం తెల్ల‌వారుజాము నుంచి 200ల‌కు పైగా బ‌స్సు స‌ర్వీసుల‌ను ఆర్టీసీ అధికారులు ప్రారంభించారు. ఇక న‌గ‌రంలో ఆర్టీసీ బ‌స్సుల ప్రారంభంపై రెండు, మూడు రోజుల్లో అధికారులు స్ప‌ష్ట‌త ఇవ్వ‌నున్నారు. అన్ని ఆర్టీసీ డిపోల‌ను ఉన్న‌తాధికారులు అల‌ర్ట్ చేశారు. కండ‌క్ట‌ర్లు, డ్రైవ‌ర్లు సిద్ధంగా ఉండాల‌ని అధికారులు ఆదేశించారు. 

సంతోషంగా ప్ర‌యాణికులు

న‌గ‌ర శివార్ల‌లో ఆర్టీసీ బ‌స్సులను ప్రారంభించ‌డంతో.. స్థానిక ప్ర‌యాణికులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ బ‌స్సుల ప్రారంభంతో ఇత‌ర ప్రాంతాల‌కు రాక‌పోక‌లు సుల‌భం అయ్యాయ‌ని ప్ర‌యాణికులు తెలిపారు. ప్ర‌యివేటు వాహ‌నాల్లో అధికంగా డ‌బ్బులు చెల్లించి ప్ర‌యాణించాల్సి వ‌చ్చింద‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 


logo