యాదాద్రి భువనగిరి : ఆర్టీస బస్సు బోల్తాపడటంతో(RTC bus Overturns) పలువురు డ్రైవర్‌తో పాటు పలువురు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri )జిల్లా చౌటుప్పల్ మండలం బొర్రలగూడెం వద్ద హైవే పై చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చి క్షతగాత్రులను చౌటుప్పల్‌లోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.