నిజామాబాద్: జిల్లాలోని మెండోరా మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని బుస్సాపూర్ వద్ద ఆగిఉన్న లారీని ఆర్టీసీ బస్సు (RTC bus) ఢీకొట్టింది. దీంతో 24 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను స్థానికుల సహాయంతో దవాఖానకు తరలించారు.
గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. మిగిలినవారిని వేరే బస్సుల్లో వారి గమ్యస్థానాలకు తరలించామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.