హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): మైనర్‌పై లైంగికదాడి ఆరోపణలు ఎదురొంటూ జైలు లో ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు బెయిల్ రావడంపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 11న పుట్టినరోజు జరుపుకోనున్న బండి సంజయ్‌కు.. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన ప్రత్యేక బహుమతి ఇదేనా? అంటూ ఆయన గురువారం ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
‘శభాష్ రేవంత్‌రెడ్డీ.. మిత్రుడంటే మీలా ఉండా లి’ అంటూ చురకలంటించారు. హైకోర్టు తీ ర్పును తాము గౌరవిస్తామని, కానీ, ఇంతటి తీవ్రమైన కేసులో నిందితునికి ఇంత త్వరలో బెయిల్ రావడం బాధాకర మని పేరొన్నారు. ఇన్నాళ్లూ ఈ కేసులో బాధితురాలిని ప్రజలు, న్యాయవ్యవస్థే కాపాడాయని, బాధితురాలికి అండగా నిలువాల్సిన ప్రభుత్వం, ఉల్టా ఆ బిడ్డను హనీట్రాప్ కేసులో ఇరికించి అరెస్ట్ చేయాలని చూసింద ని ధ్వజమెత్తారు.
కేసు ప్రారంభం నుంచి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని, నిందితునికి ఎలాగైనా బెయిల్ ఇప్పించి కాపాడాలనే ఉత్సుకత ప్రభుత్వ పెద్దల్లో కొట్టొచ్చినట్టు కనిపించిందని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నో కేసులకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను (స్పెషల్ పీపీ) నియమించిన రేవంత్ సరార్.. ఈ కేసులో మాత్రం ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించిందని, కనీ సం దీనిపై సిట్ కూడా వేయలేదని తెలిపారు.
గతంలో నిందితునికి పరీక్షల పేరుతో రహస్యంగా మధ్యంతర బెయిల్ వచ్చినప్పుడే రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ మధ్య ఉన్న మైత్రీబంధం బయటపడిందని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. రేవంత్‌రెడ్డి రాష్ట్ర హోంమంత్రిగా, బండి సంజయ్ కేంద్రంలో మంత్రిగా ఉన్నంతకాలం ఆ బాధితురాలికి న్యాయం జరుగదని ఆందోళన వ్యక్తంచేశారు.
ప్రభుత్వ లాయర్లు నిందితుడి తరఫున నిలబడ్డారని, బాధితురాలు ప్రైవేట్ లాయర్‌ను ఆశ్రయించకపోతే ఈ కేసు ఎప్పుడో నీరుగారిపోయేదని పేరొన్నారు. 10 నుంచి 20 ఏండ్లపాటు జైలుశిక్ష పడాల్సిన నిందితుడు.. ఈ రోజు ప్రభుత్వ అభయంతో బెయిల్‌పై బయటకు వస్తున్నాడని, భవిష్యత్తులో అతడు ఇంకెన్ని ఘాతుకాలకు పాల్పడుతాడో ఊహించలేమని ఆందోళన వ్యక్తంచేశారు.
ఈ మైనర్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత యావత్తు తెలంగాణ సమాజానిదేనని పిలుపునిచ్చారు. ఆమె భవిష్యత్తులో న్యాయంకోసం చేసే పోరాటానికి మనమందరం బాసటగా నిలబడాలని, బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్పష్టంచేశారు.