RS Praveen Kumar | సైబర్ పెట్రోలింగ్ పేరుతో తెలంగాణ భవన్‌పైనే దృష్టి కేంద్రీకరించారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. నిజంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైబర్ పెట్రోలింగ్ చేస్తున్నదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ సోషల్‌మీడియా అకౌంట్ల మీద ఒక్క కేసు కూడా ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి కేవలం బీఆర్ఎస్ సోషల్‌మీడియా అకౌంట్లే కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మార్ఫింగ్ ఫొటోలను పోస్టు చేస్తున్నారని, కాంగ్రెస్ సోషల్‌మీడియా అకౌంట్ల నుంచి దారుణంగా ట్రోల్ చేస్తున్నారని తెలిపారు. రేవంత్ సైన్యం పేరిట కేటీఆర్‌పై దారుణమైన పోస్టులు పెడితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఎన్ని దారుణమైన పోస్టులు పెడుతున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని అడిగారు.
గౌతమ్, దిలీప్ కొణతం, మన్నె క్రిశాంక్ సోషల్‌మీడియా పోస్టుల్లో ఎలాంటి అసభ్యత ఉండదని.. అయినా వారిపై కేసులు ఎలా నమోదు చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ నిలదీశారు. దిలీప్ కొణతం, జర్నలిస్టు రేవతిపై వ్యవస్థీకృత నేరాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారని, వారంతా ఏం తప్పు చేశారని ప్రశ్నించారు. సోషల్‌మీడియాలో ప్రజల బాధను పోస్టు చేస్తే.. అది ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా అవుతుందని నిలదీశారు. ఇవాళ తెలంగాణలో ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నది కాంగ్రెస్, బీజేపీలు అని, వాటి మీద కేసులు పెట్టాలని సూచించారు. వాటిపై బీఆర్ఎస్ నేతలు ఎన్ని ఫిర్యాదులు చేసినా పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిజంగా సైబర్ పెట్రోలింగ్ చేస్తున్నారా?
కాంగ్రెస్, బీజేపీ సోషల్ మీడియా అకౌంట్ల మీద ఒక్క కేసు కూడా ఎందుకు పెట్టలేదు?
సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి కేవలం బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తల అకౌంట్లే కనిపిస్తున్నాయా?
కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మార్ఫింగ్ ఉన్న… pic.twitter.com/4dCVyv4I3a
— Telugu Scribe (@TeluguScribe) March 29, 2025
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఎలా పనిచేయాలో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వివరించారు. సైబర్ పెట్రోలింగ్‌ను సెక్రటేరియట్లో చేయాలని.. అప్పుడే తెలంగాణ ప్రజలకు న్యాయం జరగుతుందని అన్నారు. సెక్రటేరియట్లో అన్ని హెచ్ఓడీలకు ఈ-ఆఫీస్ అనే ఒక పోర్టల్ ఉంటుందని.. సైబర్ సెక్యూరిటీ బ్యూరో బోర్డుకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే ఈ-ఆఫీసు మీద పెట్రోలింగ్ చేయాలని సవాలు విసిరారు. అక్కడ అవినీతి గురిచంఇ తెలుస్తుందని.. అప్పుడు ప్రజలకు న్యాయం చేయాలని సూచించారు. ఈ-ఆఫీసులో ఎక్కడ అవినీతి జరుగుతుందనే దానిపై తన దగ్గర ఆధారాలు ఉన్నాయని తెలిపారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు వస్తే ఆధారాలను ఇస్తానని చెప్పారు. సెక్రటేరియట్లో రేవంత్ అన్నదమ్ముళ్లు చెబితే కానీ, ఫైళ్లు కదలడం లేదని అన్నారు. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్‌ను యథేచ్ఛగా వసూలు చేస్తున్నారని అన్నారు.