మంచిర్యాల, జూన్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో అవినీతి, అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. అర్హులైన పేదలకు ఇండ్లు ఇవ్వకుండా లంచం ఇచ్చినవారికే ప్రా ధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ ఒకటో వార్డులోగల గుంటూరు, ఎఫ్, డీ కాలనీల్లో మంగళవారం ఆయన పర్యటించారు. ఇండ్లు లేని పేద కుటుంబాలను కలిసి మాట్లాడారు.
కాగజ్‌నగర్‌లో కుందుల పుష్పలీల, ఉషాదేవి పేర్లు ఇందిరమ్మ ఇండ్ల మొదటి జాబితాలో వచ్చినప్పటికీ ఒంటరి మహిళ, వృద్ధ మహిళల పేరుతో తుది జాబితా నుంచి వారి పేర్లు తొలగించడం అన్యా యమన్నారు. కాంగ్రెస్ లీడర్లు, అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడి అర్హులైన పేదలకు ఇళ్లు ఇవ్వడంలో విఫలమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ చెప్పిన ప్రజాపాలన, ప్రజలను దోచుకునే పాలనగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. అర్హులైన పేదలకు ఇండ్లు ఇవ్వాలని.. లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.