RS Praveen Kumar | కాగజ్నగర్ : దిందా పోడు రైతులను అక్రమంగా అరెస్ట్ చేసి తరలిస్తుండగా బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కాగజ్నగర్ నుంచి సిర్పూర్ టీకి తరలించారు. అక్కడి నుంచి కౌటాలకు తరలిస్తుండగా పోలీసుల వాహనాన్ని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. అడ్డుకున్న నాయకులను పక్కకు చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌటల వైపు తీసుకెళ్లినట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.