లింగాల, నవంబర్ 26 : నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం పద్మన్నపల్లిలోని రోడ్డు పక్కన హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అవి ఏపుగా పెరిగి పొలానికి అడ్డంగా ఉన్నాయన్న ఉద్దేశంతో రైతు శ్రీకాంత్‌రెడ్డి ఈ నెల 20న 22 చెట్లను నరికివేశాడు. ఇది తెలుసుకున్న పంచాయతీ సిబ్బంది రూ.8వేలు జరిమానా విధిస్తూ రైతుకు నోటీసు జారీ చేశారు. దీంతో కలత చెందిన శ్రీకాంత్‌రెడ్డి 21న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం రైతు నాగర్‌కర్నూల్ ఏరియా దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం పంచాయతీ కార్యదర్శి భానుచందర్ ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసినట్టు ఎస్సై నాగరాజు తెలిపారు.