హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : కవి, గాయకుడు, స్ట్రీట్ ప్లే దర్శకుడు, డప్పు కళాకారుడు పైలం సంతోష్ కుటుంబానికి తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ సోమవారం రూ.5 లక్షల చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అనారోగ్య కారణాలతో గతేడాది మరణించిన సంతోష్ కుటుంబానికి అండగా నిలిచేందుకు సారథి కళాకారులు 550 మంది రూ. 5 లక్షల విరాళంగా అందజేశారన్నారు. ఇప్పటి వరకు మృతి చెందిన 10 మంది కళాకారులకు దాదాపు రూ. 50 లక్షలు ఇలా సమీకరించుకొని ఇచ్చామన్నారు.
తెలంగాణ ధూంధాంలో పని చేసిన సంతోష్, ప్రత్యేక రాష్ట్రం కోసం కాలుకు గజ్జ కట్టుకొని, గొంగడి వేసుకొని తిరిగారన్నారు. ఆయన సేవలను గుర్తించిన సీఎం ప్రత్యేక రాష్ట్రం రాగానే సాంస్కృతిక సారథిలో ఉద్యోగం కల్పించారన్నారు.
హైదరాబాద్లోని సారథి కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంతోష్ భార్య మంగమ్మ, కుమార్తె స్నేహలకు చెక్కును అందజేశారు. కళాకారులు అభినయ శ్రీనివాస్, యశ్పాల్, అంబటి వెంకన్న, బోడ చంద్రప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
సల్మాన్ ఖుర్షీద్ ఇంటికి నిప్పు.. ఇది హిందూయిజం కాదని వ్యాఖ్య
Home Loans Best Time | ఇండ్ల కొనుగోలుకు ఇదే బెస్ట్ టైం.. ఈ బ్యాంకుల్లో మరింత తగ్గిన వడ్డీరేట్లు
Bjp | బీజేపీ నేతలపై మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్