Miss World Pageant | హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో ప్రపంచ అందాల పోటీల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చుకు సిద్ధమైందని తెలుస్తున్నది. భారీ వేదికలు, ఏర్పాట్ల కోసం దాదాపు రూ.200 కోట్లను వెచ్చించనున్నట్టు సమాచారం. ఈ మొత్తాన్ని సాంస్కృతిక, పర్యాటకశాఖలు, జీహెచ్ఎంసీలు భరించేలా ప్ర ణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. ఓ వైపు ఖజానా ఖాళీ అయిందని చెప్తున్న ప్ర భుత్వ పెద్దలు.. మరోవైపు అందాల పో టీలు ఆర్భాటంగా నిర్వహించాల్సిన అవసరమేంటని ప్రతిపక్షపార్టీల తోపాటు పలు ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి.
హైదరాబాద్ వేదికగా ఈ నెల 10 నుంచి నుంచి 31 వరకు 72వ ప్రపంచ అందాల పోటీలు జరుగుతాయని మిస్ వరల్డ్ సంస్థ ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా 140 దేశాల నుంచి యువతులు పోటీల్లో పాల్గొంటారని తెలిపింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆరంభ వేడుకలు, హైటెక్స్‌లో ఫైనల్స్ పోటీలు నిర్వహిస్తామని సంస్థ సీఈవో వెల్లడించారు. మరోవైపు ప్రభుత్వం రాష్ట్రంలోని 10 వేదికలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే హైటెక్స్, శిల్పారామం, గచ్చిబౌలి స్టేడియం, పోచంపల్లి, యాదగిరిగుట్ట, రామప్ప, లక్నవరం, నాగార్జునసాగర్, వికారాబాద్ ప్రాంతాలను ఎంపిక చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాం తాల్లో అందాల పోటీలు నిర్వహిస్తే ఆయా ప్రదేశాల్లో పర్యాటక అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు.
అందాల పోటీలతో కూడా పెట్టుబడులు ఆకర్షిస్తామని ప్రభుత్వం చెప్పడంపై విపక్షాల నేతలు, ప్రజలు నిలదీస్తున్నారు. అందాల పోటీలతో పెట్టుబడులు ఎలా ఆకర్షిస్తారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పోచంపల్లి చీరలను అందాల పోటీల్లో పాల్గొనే యువతులు ధరిస్తే ఆ చీరలు ప్రపంచ ప్రసిద్ధి చెందుతాయని ప్రభుత్వ పెద్దలు వివరిస్తున్నారు. కానీ ప్రపంచ ఖ్యాతి పొందిన పోచంపల్లి చీరలకు అందాల పోటీలతో అదనంగా కలిగే ప్రాచుర్యం ఏమిటని సాంస్కృతికరంగ ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ప్రభుత్వం ఆర్భాటం కోసం, జేబులు నింపుకోవడం కోసం చేస్తున్న ఎత్తుగడ అని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ము ఖ్యంగా రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆ సమస్యలు కాదని అందాల పోటీలకు ప్రాధాన్యత ఇవ్వడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
మిస్ వరల్డ్ పోటీలను రాష్ట్ర పర్యాట క, సాంస్కృతిక, ఆర్థిక రంగాల అభివృద్ధికి వేదికగా మలుచుకుంటామని పర్యాటకశాఖ ప్రకటించింది. అందాల పో టీల ద్వారా రాష్ర్టానికి పెట్టుబడులు, పర్యాటకులను ఆకర్షించేందుకు ఉపయోగపడుతాయని వెల్లడించింది. కానీ ప్రభుత్వం చెప్తున్న కారణాలు, వివరణలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఖర్చును భరించి ఏర్పాటు చేసుకోవాల్సిన భారత్ సమ్మిట్-2025 కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో రూ.30కోట్లు ఖర్చు పెట్టి నిర్వహించింది. పార్టీ కార్యక్రమానికి ప్ర భుత్వ నిధులు వెచ్చించడమేంటని విపక్షాలు, ప్రజలు ప్రశ్నించారు. భారత్ సమ్మిట్ ద్వారా పెట్టుబడులు ఆకర్షిస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పారు. కానీ సమ్మిట్ ద్వారా ఎన్ని రూపాయల పెట్టుబడులు వచ్చాయనేది ప్రకటించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.