మహబూబ్నగర్: మరో రెండు రోజుల్లో పోలింగ్. నేటితో ప్రచారానికి తెరపడనుంది. దీంతో ఓటర్లను ప్రసాన్నం చేసుకోవడానికి పార్టీలు, నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో ఎన్నికల్లో మద్యం, డబ్బు ప్రవాహాన్ని అడ్డుకోవడానికి ఎన్నికల సంఘం, అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈక్రమంలో మహబూబ్నగర్ జిల్లాలోని (Mahabubnagar) బాలానగర్ వద్ద భారీగా మద్యం పట్టుబడింది.
జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీలు చేస్తుండగా ఓ లారీ అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో దానిని సీజ్చేశారు. దాని విలువ రూ.2 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. గోవా నుంచి విజయవాడకు తరలిస్తున్నారని చెప్పారు. ఈ మద్యాన్ని ఎవరు, ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే విషయం తెలియాల్సి ఉంది.