హైదరాబాద్ : హనుమకొండ(Hanumakonda జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆటో బోల్తాపడి(Auto overturned) ఓ మహిళ మృతి(Woman killed) చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన దామెర మండలం ఊరుగొండ వద్ద చోటు చేసుకుంది. మంగళవారం హైదరాబాద్ నుంచి మేడారం(Medaram) జాతరకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.